విజయనగరం వైసీపీ నేత యడ్ల రమణమూర్తి కన్నుమూత

  • అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి
  • సీనియర్‌ నాయకుడు బొత్స సత్తిబాబుకు రమణమూర్తి బంధువు
  • టీడీపీ నుంచి కాంగ్రెస్‌, అనంతరం వైసీపీలో చేరిక
విజయనగరం పట్టణానికి చెందిన సీనియర్‌ రాజకీయ నాయకుడు యడ్ల రమణమూర్తి అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణకు ఆయన సమీప బంధువు. ఒకప్పుడు విజయనగరం టీడీపీలో కీలక నేతగా ఓ వెలుగు వెలిగిన రమణమూర్తి వైఎస్సార్‌ మరణం తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు, తన బంధువు సత్తిబాబు పార్టీలో కీలక నేతగా మారడంతో సైకిల్‌ దిగి చెయ్యందుకున్నారు. ఆ తర్వాత బొత్సతోపాటే వైసీపీలో చేరారు. అనారోగ్యం కారణంగా కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొద్ది రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.
Go Back to Shorts
Vijayanagaram District
yadala ramanamurty
died due to ill health

More Telugu News